క్రైస్తవ సోదరుల పవిత్ర పండుగ క్రిస్మన్‌ను పురస్కరించుకుని దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత ఎల్కే.అద్వానీలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేతలంతా బుధవారం వేర్వేరుగా పత్రికా ప్రకటనలు విడుదల చేశారు.
దేశ ఏసు క్రీస్తు ప్రభోదించిన శాంతి, అహింస, పరస్పర సానుభూతి వంటి మానవతా విలువలకు ప్రతిఒక్కరు కట్టుబడి, సోదరభావంతో మెలుగుతూ దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని వారు పిలుపునిచ్చారు. కాగా, కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బుధవారం విడుదల చేసిన సందేశంలో పరస్పర సానుభూతి వంటి మానవతా విలువలు అన్ని కాలాలకు, అన్ని తరాలకు వర్తించే సార్వజనీన జీవన సత్యాలని పేర్కొన్నారు.
క్రైస్తవులకు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, తెలంగాణా రాష్ట్ర సమితి తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసీఆర్, ఎన్టీపీ అధ్యక్షుడు దేవేందర్‌గౌడ్, లెఫ్ట్ నేతలు నారాయణ, రాఘవులు, శాసన మండలి ఛైర్మన్ చక్రపాణి, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.