దేవుడు సమస్తాన్ని సృష్టించాడు.. చెడును కూడా..?

మంగళవారం, 2 డిశెంబరు 2014 (17:29 IST)
దేవుడు సమస్తాన్ని సృష్టించాడు.. కాబట్టి చెడును కూడా ఆయనే సృష్టించివుంటాడని తొలుత అనిపిస్తుంది. చెడు దానంతట అది ఉనికిలో ఉండలేదు, వాస్తవానికి మంచిలోపించటమే చెడు. 
దేవుడు సృష్టించినపుడు వాస్తవానికి మంచివిగా సృష్టించాడు. దేవుడు సృష్టించిన మంచివాటిలో మంచిని ఒకటే ఎంపిక చేసుకోగలిగేది స్వేచ్ఛగలిగిన జీవులు మాత్రమే. వాస్తవికమైన ఎంపిక చేసుకోవటానికి వీలు కల్పించుటకుగాను, మంచికి భిన్నముగాని ఎంపిక చేసుకొనే అనుమతిని దేవుడు కల్పించాడు. 
 
దేవుడు, దేవదూతలు మరియు మనుష్యులకు మంచిని అంగీకరించే లేక మంచిని తృణీకరించీ (చెడు) చేయుటకుగాను ఎంపిక చేసుకొనే అనుమతిని దేవుడు కల్పించాడు. రెండు మంచి విషయముల మధ్య చెడు సంభంధమున్నట్లయితే దానిని చెడ్డది అని అంటాం. అయితే అది దేవుడు సృష్టించిన చెడ్డ వస్తువు కాదు. అయితే అది ఒక వస్తువు అయిపోలేదు, దానిని దేవుడు సృష్టించాడు అన్నట్లు.
 
ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే చక్కని ఉదాహరణ ఏంటంటే.. "చలి ఉనికిలో ఉందా" అని ఎవరైనా అడిగితే "ఉంది" అని జవాబివ్వవచ్చు. అయితే అది సరియైన జవాబు కాదు. ఎందుకంటే చల్లదనం ఉనికిలో ఉండదు, ఉష్ణత లోపించడమే చల్లదనం. అదేవిధంగా అంధకారము అనేది ఉనికిలో ఉండదు, వెలుగు లోపించడమే. చెడు అనేది మంచిలోపించటమే. ఇంకా శ్రేష్టమైన జవాబు ఏంటంటే చెడు అనేది దేవుడు లోపించడమే. 
 
దేవుడు చెడును సృష్టించాల్సిన ఆసరంలేదు. అయితే మంచి లేకుండా ఉండగలిగేవుండే పరిస్థితిని అనుమతించాలి. దేవుడు చెడును సృష్టించలేదుగాని అనుతించాడని క్రైస్తవ గురువులు సెలవిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి