ప్రపంచంలోనే అతి చిన్న బైబిల్ తయారైంది. ఇది చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది. కేవలం పది గ్రాముల బరువు కలిగిన ఈ బైబిల్ ప్రదర్శనకే హైలెట్‌గా నిలుస్తోంది. ఈనెల 25వ తేదీ క్రైస్తవ సోదరుల పవిత్ర పండుగ అయిన క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ప్రపంచం మొత్తం సిద్ధమవుతున్న విషయం తెల్సిందే.
ఈ పండుగను పురస్కరించుకుని కేరళ రాష్ట్రంలోని కోళికోడ్‌లో బైబిల్ ప్రదర్శన ఒకటి శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో పలు రకాల బైబిల్స్ ప్రదర్శనకు ఉంచారు. ఇందులో ఒకటి అతి చిన్న బైబిల్. ఇది గిన్నీస్ బుక్ రికార్డులో చోటు సంపాదించినా ఆశ్చర్య పోనక్కర లేదంటున్నారు నిర్వాహకులు.