కావలసిన పదార్థాలు : మెత్తగా చేసిన వెన్న.. వంద గ్రా. మైదా.. 300 గ్రా. ఉప్పు.. ఒక టీ. బేకింగ్ పౌడర్.. 1 టీ. గుడ్లు.. రెండు అజ్వైన్ (వాము).. 20 గ్రా. పాలు.. వంద ఎం.ఎల్.
తయారీ విధానం : మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్ కలిపి ఓ గిన్నెలో జల్లెడ పట్టాలి. దీనికి మెత్తగా చేసిన వెన్నని కలుపుకోవాలి. కోడిగుడ్లను పగులగొట్టి వేరే గిన్నెలో పోసి బాగా గిలకొట్టాలి. ఆ తరువాత మైదాపిండి మిశ్రమానికి గుడ్డు సొనను కలపాలి. దాంట్లోనే పాలు, అజ్వైన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని వెన్నరాసిన బేకింగ్ ట్రే లేదా కుకీ మౌల్డ్స్ (మార్కెట్లో దొరుకుతాయి)లో సర్ది, 180 డిగ్రీల వరకు ముందుగానే వేడి చేసుకున్న మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టాలి. తరువాత మరో 15 నిమిషాలపాటు బేక్ చేసి తీసేయాలి. అంతే కమ్మగా అలరించే అజ్వైన్ కుకీస్ తయారైనట్లే..!