కావలసిన పదార్థాలు : క్యారెట్ తురుము.. ఒక కప్పు బీన్స్ ముక్కలు... ఒక కప్పు క్యాబేజీ తురుము... ఒకటిన్నర కప్పు అల్లంవెల్లుల్లి... ఒక టీ. చిల్లీసాస్... ఒక టీ. అజినమోటో... పావు టీ. మిరియాలపొడి... పావు టీ. కోడిగుడ్డు తెల్లసొన... ఒకటి కార్న్‌ఫ్లోర్... 4 టీ. మైదా... 4 టీ. జీడిపప్పు... వంద గ్రా. ఉప్పు... తగినంత నూనె... సరిపడా.
తయారీ విధానం : సన్నగా తరిగిన కూరగాయలన్నింటినీ ఓ గిన్నెలో వేసి కలపాలి. అందులోనే మిగిలిన దినుసులన్నీ కూడా వేసి మరీ జారుగా కాకుండా కాస్త గట్టిగానే పకోడీల పిండిలా కలపాలి. బాణలిలో నూనె పోసి కాగిన తరువాత కూరగాయల మిశ్రమాన్ని గుండ్రటి ముద్దలుగా చేసి వేసి, ఎర్రగా వేయించి తీయాలి. వీటిని టొమాటో సాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.