కుకుంబర్ కూలర్

FILE
కావలసిన పదార్థాలు :
దోసకాయ... ఒకటి
చల్లటి మజ్జిగ... అర లీ.
అల్లంతురుము... పావు టీ.
నల్లమిరియాలపొడి... చిటికెడు
జీలకర్ర... చిటికెడు
కొత్తిమీర... ఒక టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
మిక్సర్‌ జార్‌లో దోసకాయ ముక్కలు, అల్లం తురుము, మిరియాలపొడి, జీలకర్ర పొడి వేసి తక్కువ స్పీడుతో కచ్చాపచ్చాగా బ్లెండ్ చేయాలి. పాత్రలోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని అందులో మజ్జిగ పోయాలి. ఇంకో పాత్రలోకి పోస్తూ బాగా కలపాలి. సర్వ్ చేసేముందు పైన కొత్తిమీర ఆకులను చల్లి సర్వ్ చేయాలి. అంతే కుకుంబర్ కూలర్ సిద్ధమైనట్లే..! ఈ కుకుంబర్ కూలర్ కోసం కీరకాయను వాడుకోవచ్చు. చల్లగా సేవించాలనుకునేవారు ఐస్‌క్యూబ్స్‌ను వేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి