కావలసిన పదార్థాలు : ఉల్లిపాయలు పెద్దవి... రెండు ఛీజ్ క్యూబ్స్... 200 గ్రా. టొమోటోలు... రెండు పచ్చిమిర్చి... రెండు నిమ్మరసం... రెండు టీ. కొత్తిమీర... రెండు కట్టలు మిరియాలపొడి, ఉప్పు... రుచికి సరిపడా
తయారీ విధానం : ముందుగా ఉల్లిపాయలను చక్రాల్లాగా కోసి విడదీసి వాటిని ఓ ప్లేట్లో పెట్టుకోవాలి. అందులో ఛీజ్ క్యూబ్స్, టొమోటో ముక్కల్ని కూడా వేయాలి. పచ్చిమిర్చిని సన్నగా తరిగి అందులోనే వేయాలి. నిమ్మరసం, మిరియాలపొడి, ఉప్పును కూడా ఉల్లిపాయలపై చల్లాలి. చివర్లో కొత్తిమీర ఆకులతో పైన అందంగా అలంకరించి సర్వ్ చేయాలి. అంతే ఆనియన్ ఛీజ్ సలాడ్ రెడీ అయినట్లే...!