కావలసిన పదార్థాలు : గింజలు తీసివేసిన పుచ్చకాయ ముక్కలు.. ఒక కప్పు తాజా పుదీనా ఆకులు.. పదిహేను నిమ్మరసం.. అర కప్పు పంచదార పాకం.. నాలుగు టీ. ఐసు ముక్కలు.. తగినన్ని
తయారీ విధానం : పుచ్చకాయ ముక్కలు, పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడగట్టి, తగినన్ని నీళ్లు చేర్చుకోవాలి. తరువాత నిమ్మరసం, పంచదార పాకం వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లోకి ఒంపి.. పైన తగినన్ని ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేస్తే సరి. అంతే చల్ల చల్లగా అలరించే మెలన్ అండ్ మింట్ మాక్‌టెయిల్ తయార్..! ఈ జ్యూస్ బాగా చల్లగా కావాలనుకునేవారు కాసేపు డీప్ ఫ్రిజ్‌లో ఉంచి, ఆ తరువాత తాగవచ్చు.