కావలసిన పదార్థాలు : చికెన్.. అర కేజీ కాలీఫ్లవర్.. ఒకటి నూనె.. వంద గ్రా. ఉల్లిముద్ద.. ఒక కప్పు టొమోటో ముక్కలు.. ఒక కప్పు అల్లంవెల్లుల్లి... అర కప్పు కారం.. 2 టీ. పచ్చిమిర్చి తరుగు.. అర కప్పు పచ్చి కొబ్బరి ముద్ద.. అర కప్పు గసాల ముద్ద.. అర కప్పు ధనియాలపొడి.. 2 టీ. గరంమసాలా పొడి.. ఒక టీ. పసుపు.. పావు టీ. ఉప్పు.. తగినంత
తయారీ విధానం : చికెన్‌ను మరీ పెద్దగా కాకుండా ముక్కలుగా కోసి, శుభ్రం చేసి కొత్తిమీర తురుము, ధనియాల పొడి, మసాలా పొడి, కారం, పసుపు, అల్లం-వెల్లుల్లి ముద్ద, కొబ్బరి, గసాల ముద్ద, టీస్పూను ఉప్పు వేసి ముక్కలకు పట్టించి కొద్దిసేపు ఊరనిచ్చి 2 విజిల్స్ వచ్చేవరకూ కుక్కర్‌లో ఉడికించి తీయాలి. కాలీఫ్లవర్‌ను చిన్న చిన్న రెమ్మలుగా విడదీసి శుభ్రంచేసి ఉడికించాలి.
కడాయిలో నూనె పోసి కాచి, ఉల్లిముద్ద వేసి, దోరగా వేపి, అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి తురుము వేసి మంచివాసన వచ్చేవరకూ వేయించాలి. అందులో చికెన్ మిశ్రమం, కాలీఫ్లవర్, టొమాటో ముక్కలు కూడా వేసి ఉప్పు సరిజూసి, సెగ తగ్గించి ఉంచాలి. దగ్గరగా ఉడికిన తరువాత దించేయాలి. అంతే చికెన్ గోబీ సిద్ధమైనట్లే..!!