చేపలతో పులుసు కాదు.. "సూప్‌"

FILE
కావలసిన పదార్థాలు :
సొరచేప... 300 గ్రా.
ఉల్లిపాయలు... నాలుగు
క్యారెట్లు... రెండు
పసుపు.. అర టీ.
ఉప్పు... తగినంత
నిమ్మరసం... రెండు టీ.
మిరియాలపొడి... అర టీ.
వెన్న... నాలుగు టీ.

తయారీ విధానం :
సొరచేప ముక్కల్ని శుభ్రంగా కడిగి వేడినీటిలో పది నిమిషాలు ఉడికించి తీయాలి. ఆరాక చేపముక్కలమీద ఉన్న చర్మాన్ని తీసేయాలి. తరువాత ముక్కల్లోని ఎముకల్ని విడిగా తీయాలి. ఓ పాన్‌లో వెన్న వేసి పసుపు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్‌ ముక్కలు వేసి కలిపి వేయించాలి.

తరువాత చేప ఎముకలు కూడా వేసి సన్నని మంటమీద ఉడికించాలి. ఆపై అందులోనే మూడు గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. చివరగా దించేముందు మిరియాలపొడి వేసి ఉప్పు సరిచూడాలి. చివర్లో నిమ్మరసం కలిపి బౌల్స్‌లో పోసి సర్వ్ చేయాలి. అంతే ఫిష్ సూప్ రెడీ...!!

వెబ్దునియా పై చదవండి