చేమదుంపల వెరైటీ డిష్ "యామ్ కబాబ్"

కావలసిన పదార్థాలు :
చేమదుంపలు... అరకేజీ
శనగపిండి... 50 గ్రా.
యాలకులపొడి... అర టీ.
కారం... అర టీ.
తెల్ల వెనిగర్... 5 గ్రా.
కొత్తిమీర... పది గ్రా.
ఉప్పు... తగినంత
నెయ్యి... 50 గ్రా.
కూరేందుకు జీడిపప్పులు... ఎనిమిది
ఛీజ్... 50 గ్రా.
గింజలు తీసి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి... రెండు

తయారీ విధానం :
చేమదుంపలను తొక్కతీసి ముక్కలుగా చేసి వెనిగర్‌తో కలిపి ఉడికించాలి. ఉడికిన ముక్కల్ని నేతిలో వేయించి చల్లారబెట్టాలి. ఒక పాత్రలో దుంపలతోపాటు శనగపిండి, యాలకులపొడి, ఉప్పు, కారం, తరిగిన కొత్తిమీర వేసి మెత్తగా కలపాలి. మరో పాత్రలో ఛీజ్, పచ్చిమిర్చి, జీడిపప్పు ముక్కలను వేసి కలుపుకోవాలి.

దుంప పదార్థాన్ని ఉండలుగా తీసుకుని ఒత్తి, మధ్యలో ఛీజ్ మిశ్రమం పెడుతూ, దగ్గరగా మడుస్తూ గారెల్లాగా వత్తుకోవాలి. వీటిని పెనంపై రెండువైపులో నేతితో దోరగా వేయించి, పుదీనా చట్నీతో తింటే సూపర్‌గా ఉంటాయి. (మైక్రోవేవ్ ఓవెన్ ఉన్నవారు గారెలను ఒక ట్రేలో సర్ది దోరగా వేయించుకోవచ్చు).

వెబ్దునియా పై చదవండి