కావలసిన పదార్థాలు : శాండ్‌విచ్ బ్రెడ్ ముక్కలు.. 8 పనీర్.. వంద గ్రా. ఉల్లిపాయ.. ఒకటి కారం.. ఒక టీ. అల్లంవెల్లుల్లి.. అర టీ. శెనగపిండి.. వంద గ్రా. ఉప్పు.. తగినంత మంచినీళ్లు.. ఒక కప్పు నూనె.. సరిపడా
తయారీ విధానం : ఉల్లిపాయ సన్నగా తరగాలి. పనీర్ సన్నగా తురమాలి. బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేసి అల్లం వెల్లుల్లి, ఉల్లిముక్కలు వేయించాలి. పనీర్, ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి ఓ ఐదు నిమిషాలు వేయించి దించి పక్కన ఉంచాలి. బ్రెడ్ ముక్కల అంచులు తీసేసి వీటిని త్రికోణాకారంలో కట్ చేసుకోవాలి. విడిగా చిన్న గిన్నెలో చిటికెడు ఉప్పు, కొద్దిగా బియ్యప్పిండి, తగిన నీళ్లు పోసి గట్టి పేస్టులా చేసి పనీర్ ముక్కల మిశ్రమంలో కలపాలి.
కత్తిరించిన ఓ బ్రెడ్‌ముక్కను తీసుకుని దాని మీద మిశ్రమాన్ని పలుచగా పూసి పైన మరో బ్రెడ్ ముక్క పెట్టి శాండ్‌విచ్‌లా తయారుచేయాలి. ఇలా మొత్తం బ్రెడ్‌ముక్కల్ని చేసుకుని పక్కన పెట్టాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె కాగాక బ్రెడ్‌ముక్కలను వేసి ఎర్రగా వేయించి తీయాలి. వీటిని టొమాటో సాస్ లేదా చింతకాయ పచ్చడితో తింటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి.