"పనీర్ పొటాటో శాండ్‌విచ్‌"తో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్..!

FILE
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసులు.. నాలుగు
పెరుగు... 50 ఎం.ఎల్.
బంగాళాదుంపలు... 2 మీడియం సైజువి
క్యాబేజీ, క్యారెట్, పనీర్ తురుము.. అన్నీ కలిపి అరకప్పు
ఉప్పు, మిరియాలపొడి.. రుచికి సరిపడా
మీగడ.. ఒక టీ.
ఆవాల పేస్టు.. కాస్తంత

తయారీ విధానం :
పెరుగును రాత్రంతా పలుచటి వస్త్రంలో కట్టి, నీరంతా పోయేటట్లు వేలాడదీయాలి. బంగాళాదుంపలను ఉడికించి, పొట్టుతీసి మెత్తగా చిదమాలి. అందులో పనీర్, క్యాబేజీ, క్యారెట్ల తురుము.. ఉప్పు, మిరియాలపొడి, పెరుగు, మీగడ, ఆవాల పేస్టును వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని టోస్ట్ చేసిన బ్రెడ్ స్లైసుమీద సమంగా స్ప్రెడ్ చేసి పైన మరో బ్రెడ్ స్లైసుతో కప్పి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన.. సులభంగా తయారు చేయగల మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ పనీర్ పొటాటో శాండ్‌విచ్ తయార్..! టేస్ట్ చేస్తారా...?!

వెబ్దునియా పై చదవండి