కావలసిన పదార్థాలు : పచ్చికొబ్బరి తురుము... ఒక కప్పు అరటిపండ్లు... రెండు జామకాయ.. ఒకటి పంచదార.. రెండు టీ. తేనె.. రెండు టీ. ఎండు ఖర్జూరాలు.. వంద గ్రా.
తయారీ విధానం : కొబ్బరి తురుములో జామ, ఎండు ఖర్జూరం, అరటిపండు ముక్కలు వేసి కలిపి చిన్న చిన్న బౌల్స్‌లోకి సర్దాలి. వాటిని పదినిమిషాలపాటు అలాగే ఉంచినట్లయితే చక్కగా ఊరుతాయి. అంతే ఫ్రూట్ సలాడ్ రెడీ..! చాలా రుచిగా ఉండే ఈ సలాడ్‌ను దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. వృద్ధులూ, అనారోగ్యంతో బాధపడేవాళ్లూ... కటిక ఉపవాసం చేయకుండా ఈ సలాడ్‌ను తిని, గ్లాసుడు పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.