కావలసిన పదార్థాలు : మ్యాకరోనీ... 200 గ్రా. వేరుశెనగపప్పు... పది టీ. పుట్నాలపప్పు... ఎనిమిది టీ. ఉల్లిపాయలు... రెండు పచ్చిమిర్చి... ఆరు కొత్తిమీర... రెండు చిన్న కట్టలు కారం... కాస్తంత నూనె... నాలుగు టీ. ఉప్పు... తగినంత నిమ్మకాయలు... రెండు సన్నకారప్పూస... వంద గ్రా.
తయారీ విధానం : వెడల్పాటి పాత్రలో ముప్పావువంతు నీరుపోసి స్టౌపై పెట్టాలి. నీరు బాగా మరుగుతుండగా మ్యాకరోనీ, తగినంత ఉప్పు, ఒక టీ. నూనె వేసి ఉడికించాలి. మ్యాకరోని మెత్తగా ఉడికాక వేడినీటిని వంపేసి, అందులో వెంటనే చన్నీటిని పోయాలి. ఇలా చేస్తే మ్యాకోరోని ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది.
ఇప్పుడు ఒక బాణలిలో మిగిలిన నూనె పోసి వేరుశెనగపప్పు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. దీనికి ఉల్లిపాయ తరుగు, కారం, కొత్తిమీర తరుగు, పుట్నాలపప్పు, తగినంత ఉప్పును కలిపి వేయించాలి. రెండు నిమిషాల తరువాత, ఉడికించి ఉంచిన మ్యాకరోనీని వేసి కలిపి దించేయాలి.
వడ్డించేముందు దానిపై నిమ్మరసం పిండి, సన్నకారప్పూస అక్కడక్కడా చల్లితే మ్యాకరోనీ భేల్ రేడీ అయినట్లే... ఇష్టాన్ని బట్టి అవసరమైతే ఇందులో మరికొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు.