కావలసిన పదార్థాలు : పెరుగు.. రెండు కప్పులు చక్కెర... పావు కప్పు రోజ్ వాటర్... ఒక టీ. ఉప్పు... అర టీ. యాలకులపొడి... అర టీ. వెనిల్లా ఎసెన్స్... ఒక టీ. నీళ్లు... అర కప్పు ఐస్‌క్యూబ్స్... తగినన్ని
తయారీ విధానం : అన్ని పదార్థాలనూ కలిపి మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. మరీ పలుచగా కాకుండా చిక్కగానే చేసుకుని.. సర్వింగ్ గ్లాసుల్లో ఈ మిశ్రమాన్ని పోయాలి. ఐస్‌క్యూబ్స్ వేసి, వీలయితే పండ్ల ముక్కలతో అలంకరించి సర్వ్ చేయవచ్చు. అంతే చల్లచల్లని, మధురమైన మసాలా లస్సీ తయారైనట్లే...! చాలా సులభంగా తయారయ్యే ఈ లస్సీని మీరూ ట్రై చేసి చూస్తారు కదూ...!!