వంకలు లేని "బ్రింజాల్ మంచూరియా"

FILE
కావలసిన పదార్థాలు :
వంకాయలు... నాలుగు
క్యాప్సికం... ఒకటి
ఉల్లిపాయ... ఒకటి
పచ్చిమిర్చి... నాలుగు
మొక్కజొన్నపిండి... 8 టీ.
మైదాపిండి... 8 టీ.
అల్లంతురుము... 2 టీ.
వెల్లుల్లిరేకలు... 4
టొమోటో సాస్... 3 టీ.
సోయా సాస్... 2 టీ.
చక్కెర... ఒక టీ.
ఉప్పు, నూనె... తగినంత

తయారీ విధానం :
మొక్కజొన్న పిండి, మైదా, ఉప్పు తీసుకుని నీళ్లుపోసి జారుగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలను పిండిలో ముంచి తీసి కాగుతున్న నూనెలో వేసి వేయించాలి. మరో పాత్రలో నూనె వేడిచేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలను వేసి వేయించాలి. అందులోనే అల్లం తురుము, వెల్లుల్లి రేకలు, టొమోటో సాస్, సోయా సాస్‌లను వేసి కలిపి వేయించాలి.

ఐదు నిమిషాల తరువాత... చక్కెర, తగినంత ఉప్పు, అరకప్పు నీళ్లుపోసి మూత పెట్టాలి. మిశ్రమం చిక్కబడుతుండగా, వేయించి ఉంచుకున్న వంకాయ ముక్కలను వేసి బాగా కలియబెట్టాలి. కూరంతా ఇగిరిపోయి ముక్కలు దగ్గరపడిన తరువాత దించేయాలి. అంతే వేడి వేడి బ్రింజాల్ మంచూరియా సిద్ధమైనట్లే..!

వెబ్దునియా పై చదవండి