కావలసిన పదార్థాలు : చికెన్ స్టాక్.. ముప్పావు లీ. కోడిగుడ్లు... రెండు టొమోటోలు... రెండు పాలకూర.. ఒక కట్ట ఉప్పు... తగినంత పంచదార.. ఒక టీ. మిరియాలపొడి.. కాస్తంత
తయారీ విధానం : చికెన్ స్టాక్‌ను మరిగించాలి. అది మరుగుతుండగానే సన్నగా తరిగిన టొమాటోలు, పాలకూర వేసి ఉడికించాలి. ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి కలపాలి. కోడిగుడ్డు సొనను పైపైన గిలకొట్టి, సూప్‌లో వేసి... నెమ్మదిగా గరిటెతో కలపాలి. కోడిగుడ్డుసొనను కలిపిన తరువాత సూప్‌ను మరిగించకూడదు. వేడివేడిగా వడ్డించాలి. అంతే చల్లటి వానల్లో వెచ్చగా, హాయిగా అలరించే టొమాటో ఎగ్ డ్రాప్ సూప్ రెడీ..!