కావలసిన పదార్థాలు : పంచదార... ఒక కప్పు పన్నీర్ తురుము... ఒక కప్పు పాలు... ఒక కప్పు యాలకుల పొడి, పిస్తాపొడి, బాదం పొడి... చెరో రెండు టీ స్పూన్లు
తయారీ విధానం : పన్నీర్ తురుము, పాలు, పంచదారలను కలిపి మిక్సీలో రుబ్బుకుని పక్కన పెట్టుకోండి. ఒక పాత్రలోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని అందులో కుంకుమ పువ్వు, యాలకుల పొడి, బాదం పొడులను కలిపి నాలుగు గంటల పాటు ఫ్రిజ్లో ఉంచాలి.
నాలుగు గంటల తర్వాత పాత్రను ఫ్రిజ్ నుంచి తీసి ఒక ప్లేట్ లేదా వడ్డించే ట్రే పైన బోర్లించి పాత్రను తీసివేయండి. అంతే పన్నీర్ ఫుడ్డింగ్ రెడీ. దీనిపై మీకు నచ్చిన విధంగా అలంకరించుకుని సర్వ్ చేయండి.