స్పెషల్ ఐ కేర్ ఫుడ్.. "క్యారట్ సలాడ్"

FILE
కావలసిన పదార్థాలు :
క్యారట్ తురుము.. ఒక కప్పు
పచ్చికొబ్బరి తురుము.. అర కప్పు
నిమ్మకాయ.. ఒకటి
పచ్చిమిర్చి.. ఒకటి
పసుపు.. చిటికెడు
కరివేపాకు.. ఒక రెమ్మ
కొత్తిమీర.. కొద్దిగా
పోపుకోసం ఆవాలు, జీలకర్ర... ఒక టీ.
నూనె.. ఒక టీ.

తయారీ విధానం :
ఒక బౌల్‌లో సలాడ్ కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ కలుపుకోవాలి. ఆ తరువాత పోపుకోసం తీసుకున్న పదార్థాలతో పోపు పెట్టి క్యారట్ మిశ్రమంలో కలపాలి. దీన్ని విడి విడి సర్వింగ్ బౌల్స్‌లో సర్ది.. పైన కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే క్యారట్ సలాడ్ సిద్ధం.

ఎ విటమిన్ తయారీకి అవసరమైన బీటా కెరోటిన్ పుష్కలంగా లభించే క్యారట్ తినడంవల్ల కంటికి మేలు జరుగుతుంది. చర్మానికి మంచి నిగారింపునిస్తుంది. క్యారెట్ నుండి కెరటినాయిడ్స్ అనే పోషకాలు లభిస్తాయి. పీచు పదార్థాలు కూడా ఎక్కువే. జీర్ణక్రియ కూడా సులభం అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కళంగా ఉంటాయి కాబట్టి క్యాన్సర్ రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది.

వెబ్దునియా పై చదవండి