సంతానం లేదని బాధపడుతున్నారా? డోంట్ వర్రీ. కంటినిండా నిద్రపోవడం, వీలైనంత ఎక్కువగా ద్రాక్ష పండ్లు తినడం ద్వారా కడుపు పండేందుకు అవకాశాలు మెరుగవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విపరీతమైన కడుపునొప్పి, నెలసరి సక్రమంగా లేకపోవడం ద్వారా సంతాన లేమి ఏర్పడుతుంది. ఈ సమస్యలను దూరం చేయాలంటే.. నల్ల ద్రాక్షల రసం లేదా.. ద్రాక్ష పండ్లను తీసుకోవాలి.
ద్రాక్ష పండ్లతోపాటు బ్లూబెర్రీలు, వేరుశనగలోనూ ఉండే యాంటీ యాక్సిడెంట్ రిస్‌వెరట్రాల్, మంచి నిద్రతో శరీరానికి చేరే మెలటోనిన్‌లతో సంతానలేమిని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ద్రాక్ష పండ్ల ద్వారా తయారయ్యే జ్యూస్‌ను రోజూ ఒక గ్లాసుడు తాగితే ఈ సమస్యలను చెక్ పెట్టవచ్చునని వారు చెప్తున్నారు.
తయారుచేసే విధానం:
ముందుగా యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు ఓసారి వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. జ్యూసర్‌లో మృదువుగా చేసిన ద్రాక్షరసంలో శొంఠిపొడి, మసాలాలపొడి వేసి మళ్లీ ఓసారి తిప్పాలి. తరవాత చల్లని నీళ్లు పోసి, తేనె కలిపి సర్వ్ చేయాలి.