టేస్టీ టేస్టీ కాలీఫ్లవర్ పకోడీ.. ఎలా..?

శుక్రవారం, 16 నవంబరు 2018 (12:01 IST)
గోబీపువ్వు రోజూ ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి కావలసిన పోషక విలువలు పుష్కలంగా అందుతాయి. వ్యర్థపదార్థాలను బయటకు పంపుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అధిక బరువు గలవారు గోబీ జ్యూస్ సేవిస్తే బరువు అదుపులో ఉంటుంది. ఇక పిల్లల విషయానికి వస్తే వారికి బయట దొరికే ఆహార పదార్థాలు ఎక్కువగా నచ్చుతున్నాయి. అందుకు కారణం ఇంట్లో వారికి సరైన ఆహారం లేక పోవడమే.
 
చిన్నారులకు నచ్చే విధంగా స్నాక్స్ వంటి వంటకాలు తయారుచేసిస్తే వారు బయట ఆహారాలు భుజించడానికి ఇష్టపడరు. మరి అది ఎలా సాధ్యమని ఆలోచిస్తున్నారు.. గోబిపువ్వే. ఇది ఆకలి నియంత్రణకు చాలా మంచిది. కనుక దీనితో పకోడీలు ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
కాలిఫ్లవర్ - 1 
మెుక్కజొన్న పిండి- అరకప్పు
నూనె - సరిపడా
ఉప్పు - తగినంత
కారం - సరిపడా
కలర్ పొడి - కొద్దిగా.
 
తయారీ విధానం:
ముందుగా గోబీపువ్వును చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత వేనీళ్లతో వాటిని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పువ్వుల్లో కొద్దిగా ఉప్పు, కారం, మెున్నజొన్న పిండి, మిరియాల పొడి, కలర్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత బాణలిలో నూనెను పోసి వేడయ్యాక వాటిని వేయించుకోవాలి. అంతే టేస్టీ అండ్ హెల్తీ కాలీఫ్లవర్ పకోడీ రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు