కాకరకాయ చేదే.. ఇలా చిప్స్ చేసుకుంటే.. అది ఉండదు..?

మంగళవారం, 13 నవంబరు 2018 (11:57 IST)
కాకరకాయలోని విటమిన్స్, ప్రోటీన్స్ చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. అధిక బరువును తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది వీటిని వంటకాల్లో చేర్చుకోరు. పిల్లలు కూడా దీనిని అంతగా ఇష్టపడరు. కనుక మెంతిపొడితో ఇలా చిప్స్ చేస్తే.. చేదు ఉండదు.. ఎలా చేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
కాకరకాయలు - 250 గ్రా
మెంతులు - 50 గ్రా
జీలకర్ర, ఆవాలు - 2 స్పూన్స్
కరివేపాకు - 2 రెమ్మలు
పచ్చిమిర్చి - 10 గ్రా
ఉల్లిగడ్డ - 1
ఉప్పు - తగినంత
కారం - తగినంత
పసుపు - 1 స్పూన్
నూనె - సరిపడా
నిమ్మకాయలు - 2
 
తయారీ విధానం:
ముందుగా కాకరకాయలను రెండు అంగుళాల పొడవు ఉండే విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లలో కొద్దిగా  ఉప్పు, పసుపు వేసి కాకర ముక్కలను ఉడికించుకోవాలి. మెంతులను వేయించి పొడి చేసుకోవాలి. ఓ బాణలిలో నూనెను వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.

ఆ తరువాత కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, మెంతిపొడి వేసి కలుపుకుని 5 నిమిషాల తరువాత ఉడికించిన కాకరకాయ ముక్కలను వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు అలానే ఉంచాలి. దించే ముందుగా అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోవాలి. అంతే... మెంతిపిండితో కాకరకాయ ఫ్రై రెడీ.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు