తయారీ విధానం:
ముందుగా పెరుగులో కొద్దిగా ఉప్పు, నల్ల ఉప్పు, చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంపలను ఉడికించి.. తొక్క తీసి మెదపాలి. బఠాణీని ఉడికించుకోవాలి. ఆ తరువాత ఒక పాత్రలో ఉడికించిన బంగాళాదుంపలు, బఠాణీలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఆపై ఒక ప్లేట్‌లో పానీపూరీలను ఉంచి మధ్యలో చిన్నగా రంధ్రం చేయాలి. ఇప్పుడు బంగాళాదుంప మిశ్రమం కొద్ది కొద్దిగా అందులో పెట్టి దానిపై స్పూన్ పెరుగు, ఖట్టామీఠా చట్నీ, గ్రీన్ చట్నీ, ఉల్లి తరగు, కారప్పూస వేసుకోవాలి. చివరగా మళ్లీ పెరుగు వేసి తింటే.. ఎంతో రుచిగా ఉంటుంది.