దోరగా నేతిలో వేపిన పనీర్ ముక్కలతో టమోటా సూప్

ఆదివారం, 7 అక్టోబరు 2018 (13:26 IST)
వర్షాకాలంలో సూప్‌లను అధికంగా తీసుకోవాలి. టమోటాలో బోలెడంత విటమిన్ సి వుంటుంది. టమోటా తినేవారిలో అజీర్తి, రోగనిరోధక శక్తి లోపాలు దరిచేరవు. టమోటాలోని విటమిన్ ఏ మూలంగా కంటి చూపు ఎంతగానో మెరుగుపడుతుంది. దంతాల పటుత్వానికీ ఇదెంతగానో దోహదపడుతుంది.


టమోటాలోని క్యాల్షియం, ఫాస్ఫరస్‌ వంటి కీలక పోషకాలు రక్తాన్ని శుభ్ర పరుస్తాయి. శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్థాలూ ఇందులో పుష్కలంగా  ఉంటాయి. దీనిలోని విటమిన్లు కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. టమోటా బీపీని కంట్రోల్ చేస్తుంది. తద్వారా ఆవేశం తగ్గిపోతుంది. అలాంటి టమోటాతో హాట్ సూప్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
టమోటాలు : పావు కేజీ 
క్యారెట్ తురుము : అర కప్పు
ఉల్లిపాయ తరుగు : ఒక కప్పు
వెన్న : టేబుల్ స్పూన్
నీరు : తగినంత 
పంచదార : అర స్పూన్ 
టమోటా సాస్ : అర స్పూన్ 
ఉప్పు : ఒక స్పూన్ 
పనీర్ ముక్కలు : దోరగా నేతిలో వేయించినవి 
 
తయారీ విధానం.. 
టమోటాలు, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలను మందపాటి పాత్రలో వెన్నవేసి సన్నని సెగపై కాగాక అందులో వేయాలి. మూడు కప్పుల నీరు పోసి ఉడికించాలి. పేస్టు మాదిరి తయారుచేసి వడకట్టాలి. లైట్‌గా వేడిచేసి టోమేటో సాస్, పంచదార, ఉప్పు కలిపి సర్వ్ చేయాలి. అంతే టమోటా సూప్ రెడీ అయినట్లే. అలాగే సర్వ్ చేసేటప్పుడు కార్న్ చిప్స్‌ను లేదా దోరగా వేయించిన పనీర్ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు