మదర్స్ డే స్పెషల్ : లెమన్ కేక్ విత్ రాస్బెర్రీస్!

శనివారం, 9 మే 2015 (19:10 IST)
మదర్స్ డే స్పెషల్‌గా లెమన్ కేక్ రాస్బెర్రీస్‌ను ట్రై చేయండి. వేసవిలో లెమన్‌తో కేక్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. రాస్బెర్రీస్ ఆరోగ్యానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. రాస్బెర్రీస్ బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి పోషకాలతో కూడిన లెమన్, రాస్బెర్రీస్‌తో మదర్‌కు గిఫ్ట్‌గా ఈ కేక్‌ను గిఫ్ట్ చేయండి. 
 
కావలసిన పదార్థాలు : 
నాన్ సాల్ట్ బటర్  : అర కప్పు 
పంచదార పొడి : రెండున్నర కప్పులు  
కోడిగుడ్లు : నాలుగు
మైదా : 3 కప్పులు 
బేకింగ్ పౌడర్ : అర టీ స్పూన్ 
బేకింగ్ సోడా : అర టీ స్పూన్ 
లెమన్ జ్యూస్ : ముప్పావు కప్పు 
మజ్జిగ : ముప్పావు కప్పు 
వెనిల్లా ఎసెన్స్ : ఒక టీ స్పూన్
రాస్బెర్రీస్ : ఒక కప్పు 
 
తయారీ విధానం: 
ముందుగా ఒక బౌల్‌లో మైదా, క్రీమ్, పంచదార పొడి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందుకు కాస్త నిమ్మరసం చేర్చాలి. ఐదు నిమిషాల పాటు మిశ్రమం జారుగా తగినన్ని నీటితో కలుపుతూ ఉండాలి. గుడ్లను కూడా చేర్చి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమానికి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ చేర్చి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్‌లో మజ్జిగ, వెన్నిలా ఎసెన్స్, బాగా మిక్స్ చేసుకోవాలి. రాస్బెర్రీ పేస్ట్ కూడా చేర్చి బాగా మిక్స్ చేసి మైదా మిశ్రమం కూడా చేర్చి.. కేక్ లాంటి రౌండ్ లేదా మీకు నచ్చిన షేప్ బౌల్‌లో వుంచి 45 నిమిషాల నుంచి ఒక గంట పాటు ఉడికించాలి. ఈ కేక్‌ బాగా బేక్ అయ్యాక కేక్‌పై పంచదార పొడి కాసింత చల్లుకోవాలి. లెమన్ జ్యూస్ కూడా లైట్‌గా స్ప్రై చేసుకోవాలి. అంతే మీకు నచ్చిన ఫ్రూట్‌తో గార్నిష్ చేసి కట్ చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి