కొత్తిమీర తరుగు - అరకప్పు
నిమ్మరసం- నాలుగు స్పూన్లు
బాస్మతి రైస్ - మూడు కప్పులు
తయారీ విధానం :
ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక అందులో అల్లం పేస్ట్, ఉల్లి, మిర్చి తరుగు వేసి రెండు నిమిషాల పాటు వేపాలి. తర్వాత బటర్ చేర్చి కాస్త వేడయ్యాక మష్రూమ్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేపుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్‌ను చేర్చి కాసింత పెప్పర్ చేర్చుకోవాలి.
టమోటా కెచప్, సోయా సాస్ వుంటే చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక మంట తగ్గించి రైస్‌కు మసాలా బాగా పట్టేంత వరకు మెల్లగా కలుపుతూ.. స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర తరుగు, నిమ్మరసం చేరి వేడి వేడిగా కడాయ్ చికెన్, బటర్ చికెన్‌తో సర్వ్ చేస్తే సరిపోతుంది.