ఎగ్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చూస్తుంది. ఒక కోడిగుడ్డులో ఆరు గ్రాముల హై-ప్రోటీన్స్ ఉంటాయని న్యూట్రీషన్లు అంటున్నారు. కోడిగుడ్డులో విటమిన్ బి2 ఉంటుంది. కోడిగుడ్డును ఆమ్లెట్, కూరల్లా గాకుండా వెరైటీగా స్టీమ్డ్ కర్రీ టేస్ట్ చేయండి.
తయారీ విధానం :
ముందుగా కోడిగ్రుడ్లను పగులగొట్టి ఓ గిన్నెలో సొన వేసుకోవాలి. అందులోనే తరిగిన ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, మిరియాలపొడి అన్నీ వేసి గిలగొట్టాలి. మరో గిన్నెలో అడుగున నూనె పూసి ఈ గిలకొట్టిన కోడిగుడ్ల సొన మిశ్రమాన్ని వేసి మూతపెట్టి కుక్కర్‌లోగానీ, ఆవిరిపాత్రలోగానీ పది నిమిషాలపాటు ఉడికించాలి.
బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ధనియాలపొడి, పసుపు కూడా వేసి వేయించాలి. తరువాత చిన్న ముక్కలుగా తరిగిన టమోటోలను, పచ్చిమిర్చిని కూడా చేర్చి మూతపెట్టి ఉడికించాలి. గ్రేవీ గట్టిపడిన తరువాత ఉప్పు సరిచూసుకుని, గరంమసాలా వేసి దించే ముందు పైన ఉడికించి పెట్టుకున్న గ్రుడ్లముక్కలను వేయాలి. అంతే స్టీమ్‌డ్ ఎగ్ కర్రీ రెడీ... ఇది వేడి వేడి అన్నం, చపాతీ, పూరీలలోకి అద్భుతంగా ఉంటుంది.