కావలసిన పదార్థాలు : బొప్పాయి ముక్కలు.. రెండున్నర కప్పులు తాజా పెరుగు... అర కప్పు ఐస్ క్యూబులు.. అర కప్పు తాజా అల్లం తరుగు.. ఒక టీ. తేనె.. ఒక టీ. నిమ్మకాయలు.. రెండు తాజా పుదీనా ఆకులు.. పది
తయారీ విధానం : బొప్పాయి ముక్కలు, ఐస్, పెరుగు, అల్లం, తేనె, నిమ్మరసం, జ్యూసర్‌లోకానీ మిక్సీలోకానీ వేసి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమం తగు మాత్రం ద్రవంగా మారేటట్లు నీటిని చేరుస్తూ అంతా కలిసేటట్లు చేయాలి. చివరగా కొన్ని పుదీనా ఆకులను వేసి ఓసారి బ్లెండ్ చేసి సర్వ్ చేయాలి. అంతే పపయా స్మూతీ తయార్..!
ఈ డ్రింక్ చిక్కగా రావాలంటే.. గంట ముందుగానే బొప్పాయి ముక్కలు ప్రిజ్‌లో ఉంచితే సరిపోతుంది. పెరట్లో పెరిగే చెట్టయిన బొప్పాయి ఎన్నో రకాల ఔషద గుణాలు కలిగి ఉందన్న సంగతి తెలిసిందే. ఇందులో కెరోటిన్, బి, సి.. విటమిన్లు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఈ బొప్పాయి కార్టియోవాస్క్యులర్ సిస్టమ్‌ను మెరుగు పరుస్తుంది. క్యాన్సర్‌ను నిరోధిస్తుంది, పపైన్ ఎంజైమ్ ద్వారా జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. బొప్పాయికి గాయాలను మాన్పించే ఔషధంతోపాటు అలర్జీలను నివారించే గుణం కూడా కలిగి ఉంది.