కావలసిన పదార్థాలు : చికెన్ కైమా... అర కేజీ అల్లంవెల్లుల్లి ముద్ద... రెండు టీ. గరంమసాలా... ఒక టీ. ఉప్పు... సరిపడా మిరియాలపొడి.. అర టీ. మైదా... ఒక టీ. ఉడికించిన కోడిగుడ్లు... ఆరు గిలకొట్టేందుకు కోడిగుడ్డు... ఒకటి బ్రెడ్ పొడి... ఒక కప్పు
తయారీ విధానం : చికెన్ కైమాలో అల్లంవెల్లుల్లి, గరంమసాలా వేసి బాగా కలపాలి. మైదాపిండిలో మిరియాలపొడి, ఉప్పు కలిపి దీన్ని కూడా కైమా మిశ్రమంలో కలిపి ఆరు ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఓ కైమా ముద్ద తీసుకుని దాన్ని అరచేతిలో చిన్న చపాతీలా వత్తి అందులో ఉడికించిన కోడిగుడ్డును ఉంచి, కైమాతో గుండ్రంగా చుట్టేయాలి. ఇలాగే అన్నింటినీ చేయాలి.
విడిగా ఓ కోడిగుడ్డును గిలకొట్టి అందులో కైమా ముద్దను ముంచి తరువాత బ్రెడ్‌పొడిలో దొర్లించాలి. వీటిని రెండు రెండు చొప్పున జాగ్రత్తగా నూనెలో వేయించి తీస్తే ఎగ్ టిక్కా రెడీ అయినట్లే...!!