కావలసిన పదార్థాలు : దోసకాయ... ఒకటి చల్లటి మజ్జిగ... అర లీ. అల్లంతురుము... పావు టీ. నల్లమిరియాలపొడి... చిటికెడు జీలకర్ర... చిటికెడు కొత్తిమీర... ఒక టీ. ఉప్పు... తగినంత
తయారీ విధానం : మిక్సర్ జార్లో దోసకాయ ముక్కలు, అల్లం తురుము, మిరియాలపొడి, జీలకర్ర పొడి వేసి తక్కువ స్పీడుతో కచ్చాపచ్చాగా బ్లెండ్ చేయాలి. పాత్రలోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని అందులో మజ్జిగ పోయాలి. ఇంకో పాత్రలోకి పోస్తూ బాగా కలపాలి. సర్వ్ చేసేముందు పైన కొత్తిమీర ఆకులను చల్లి సర్వ్ చేయాలి. అంతే కుకుంబర్ కూలర్ సిద్ధమైనట్లే..! ఈ కుకుంబర్ కూలర్ కోసం కీరకాయను వాడుకోవచ్చు. చల్లగా సేవించాలనుకునేవారు ఐస్క్యూబ్స్ను వేసుకోవచ్చు.