కావలసిన పదార్థాలు : బీట్రూట్ ముక్కలు... 400 గ్రా. చల్లటి నీళ్ళు... ఒక లీ. లేత పంచదార పాకం... ఒక కప్పు వెనిల్లా ఎసెన్స్... ఒక టీ. నిమ్మరసం... రెండు టీ. ఐస్‌క్యూబ్స్... పది
తయారీ విధానం : సగం ఉడికించి చల్లార్చిన బీట్రూట్ ముక్కలు, ఐసు ముక్కలను కలిపి మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేసి వడకట్టాలి. తరువాత పంచదార పాకం, నిమ్మరసం, వెనిల్లా ఎసెన్స్ వేసి లీటరు చల్లటి నీళ్లు పోసి కలిపి సర్వ్ చేయాలి.
బీట్రూట్ క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తుంది, మల బద్దకాన్ని అరికడుతుంది. దురదను పోగొడుతుంది, కిడ్నీలో చేరిన వ్యర్థ పదార్థాలను నిర్మూలిస్తుంది. పిత్తాన్ని తగ్గించటమేగాక, ఇందులోని కార్బో హైడ్రేట్లు చక్కెర కణాల్లాగా ఉండటంవల్ల త్వరగా జీర్ణమై రక్తంలో కలిసిపోతుంది. ఇందులో ప్రొటీన్లు, పీచు పదార్థాలు, కార్బోహైడ్రేటులు, కాల్షియం, పాస్పరస్, ఐరన్, విటమిన్ సి, ఎ, బి లాంటి ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్నాయి.