కావలసిన పదార్థాలు : ఆలీవ్ నూనె.. 4 టీ. ఉల్లిపాయ... ఒకటి వెల్లుల్లి ముద్ద.. ఒక టీ. జీలకర్ర పొడి... ఒక టీ. కొత్తిమీర ముద్ద... ఒక టీ. పసుపు.. అర టీ. వెన్న.. అర కప్పు పాలకూర.. మూడు కట్టలు పనీర్.. పావు కేజీ ఉప్పు.. తగినంత
తయారీ విధానం : ఒక గిన్నెలో ఆలీవ్ నూనె వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముద్ద, అల్లంముద్ద, జీలకర్ర పొడి, కొత్తిమీర ముద్ద, పసుపు వేసి వేయించాలి. బాగా వేగిన తరువాత అందులో వెన్న వేసి కలపాలి. రుబ్బిన పాలకూర ముద్దను కూడా వేసి మెల్లగా కలుపుతూ పది నిమిషాలు ఉడికించాలి.
మరో గిన్నెలో రెండు టీస్పూన్ల ఆలీవ్ నూనెను వేసి పనీర్ ముక్కలను ఎర్రగా వేయించుకోవాలి. వాటిని కూడా ఉడుకుతున్న పాలకూర ముద్దలో వేసి ఐదు నిమిషాలు ఉడికించిన తరువాత తగినంత ఉప్పు వేసి దించేయాలి. అంతే వేడి వేడి పాలక్ పనీర్ తయారైనట్లే...!