కావలసిన పదార్థాలు : జెల్లీస్... 2 కప్పులు తేనె... ఒక టీ. ద్రాక్ష... ఒక కప్పు స్ట్రాబెర్రీ... ఒక కప్పు కివి ఫ్రూట్... ఒక కప్పు ఫైనాపిల్ ముక్కలు... ఒక కప్పు
తయారీ విధానం : ఒక బౌల్‌లో పండ్లముక్కలను తీసుకుని తేనె కలపాలి. జెల్లీని చదరపు ఆకారంలో ముక్కలుగా చేసుకుని టూత్ పిక్‌కుగానీ, శుభ్రమైన పుల్లకిగానీ గుచ్చి బౌల్‌లో అమర్చి పిల్లలకి, ఇంటికివచ్చిన అతిథులకి అందించాలి.
పై విధంగానే మామిడిపండు, అరటిపండు, బొప్పాయి, జామకాయ లాంటి పండ్లతో చేసుకుని వాటికి తగిన జెల్లీలను ఎంచుకుని వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల సీజనల్‌గా దొరికే అన్ని రకాల పండ్లను, వాటిలోని పోషకాలను చిన్నపిల్లలకు అందించిన వారమవుతాము.