కావలసిన పదార్థాలు : చిక్కటిపాలు... ఒక లీ. పంచదార... 150 గ్రా. రోజ్ సిరప్... 3 టీ. సగ్గుబియ్యం... 50 గ్రా. సేమియా... వంద గ్రా.
తయారీ విధానం : పాలను వెడల్పాటి గిన్నెలో పోసి ఫ్రిజ్లో పెట్టాలి. రెండు గంటల తరువాత మిక్సీలో తిప్పడంగానీ లేదా కవ్వంతోగానీ బాగా గిలకొట్టాలి. ఓ గిన్నెలో పంచదార వేసి లేతపాకం రానివ్వాలి. దీన్ని పాలల్లో కలిపి రోజ్ సిరప్ కూడా వేసి కలపాలి. ఇందులో ముందుగానే ఉడికించి చల్లార్చిన సగ్గుబియ్యం, సేమ్యాలను కూడా పాలల్లో కలిపితే నిమిష్ సేమియా సిద్ధమైనట్లే..!