కావలసిన పదార్థాలు : పాలు... అర లీ. పంచదార.. ఒక కప్పు కోడిగుడ్డు సొన... ఒక కప్పు నట్మెగ్.. చిటికెడు బాగా పండిన మామిడిపండు గుజ్జు... అర కప్పు
తయారీ విధానం : మామిడిపండు గుజ్జులో పాలు, అరకప్పు పంచదార, కోడిగుడ్డు మిశ్రమం వేసి బాగా కలియబెట్టాలి. బాణలిలో మిగిలిన అరకప్పు పంచదార పోసి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని నాలుగు ఓవెన్ సేఫ్ బౌల్స్లలో పోసి కలిపి ఉంచుకున్న పాల మిశ్రమాన్ని పాకంమీద పోయాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీరుపోసి ఈ బౌల్స్ను ఉంచి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి సాధారణ ఉష్ణోగ్రత వద్ద 20 నిమిషాలపాటు బేక్ చేసి తీసేయాలి. అంతే మాంగో క్రీం కారామిల్ రెడీ..!