కావలసిన పదార్థాలు : పనీర్ : 200 గ్రాములు పచ్చిమిర్చి తురుము : ఒక టేబుల్ స్పూను. వెల్లుల్లి తురుము : ఒక టీ స్పూను. పుదీనా పేస్ట్ : ఒక టీ స్పూను. ఎండు మిర్చి : రెండు. కారం : చిటికెడు. ఫుడ్ కలర్ (ఎల్లో) : చిటికెడు. నిమ్మకాయ : సగం. నూనె : వేయించడానికి తగినంత. కోడిగుడ్డు : ఒకటి. అజనొమోటో : అర టీ స్పూను. మిరియాలపొడి : అర టీ స్పూను. ఉప్పు : రుచికి తగినంత.
తయారీ విధానం : ముందుగా పనీర్‌ను స్టిక్స్‌లా కట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ స్టిక్స్‌కు మైదా, అజనొమోటో, కార్న్‌ఫ్లోర్, అజనొమోటో, మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, ఫుడ్ కలర్ కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి.
స్టిక్స్‌కు అన్ని వైపులా మిశ్రమం కవర్ అయ్యేటట్లు చూసుకోవాలి. సరిపోలేదంటే మరో కోడిగుడ్డును కూడా వాడుకోవచ్చు. ఈ మిశ్రమం పట్టంచిన స్టిక్స్‌ను ఐదు నిమిషాల ఉంచి తర్వాత స్టిక్స్‌ను నూనెలో దోరగా వేయించి పక్కనబెట్టుకోవాలి.
మరో బాణలిలో నూనె వేడయ్యాక నెయ్యి, వెన్న చెరో అర స్పూన్ వేయాలి. వేడైన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, పుదీనా పేస్ట్ వేసి వేగనివ్వాలి. వేగాక నిమ్మరసం, కారం, అజనమోటో వేసి తాళింపును సమంగా కలిపి వేయించిన పనీర్ స్టిక్స్‌ను కలపాలి. అంతే పనీర్ స్టిక్స్ రెడీ..