"బ్రెడ్ కట్‌లెట్" భలే భలే...!!

FILE
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసెస్... ఎనిమిది
ఉల్లిపాయ... ఒకటి
పచ్చిమిర్చి... మూడు
అల్లం, వెల్లుల్లి పేస్ట్... రెండు టీ.
కారం... అర టీ.
కొబ్బరితురుము... రెండు టీ.
కొత్తిమీర... కాస్తంత
ఉప్పు, నూనె... తగినంత

తయారీ విధానం :
నూనె వేడిచేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తరువాత కారం, ఉప్పు, కొబ్బరి తురుము, కొత్తిమీర కూడా వేసి, వేగిన తరువాత దించేయాలి. బ్రెడ్ స్లైసులను నీటిలో వేసి, వెంటనే తీసేయాలి. వేయించిన మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసుల మధ్యలో పెట్టి, నాలుగు చివర్ల నుంచీ మూసేయాలి.

వీటిని కట్‌లెట్‌లో ఆకారంలో మెల్లిగా ఒత్తుకోవాలి. అలా మొత్తం చేసిన తరువాత పెనం నూనె వేస్తూ రెండువైపులా డీప్ ఫ్రై చేసి తీసేస్తే బ్రెడ్ కట్‌లెట్స్ తయారైనట్లే...! ఓ పట్టు పట్టేద్దామా...?!

వెబ్దునియా పై చదవండి