రోటీల్లోకి టేస్టీ సైడ్‌డిష్ "బటర్‌ మష్రూమ్స్‌"

FILE
కావలసిన పదార్థాలు :
బటన్ మష్రూమ్స్ (పుట్టగొడుగులు)... పావు కేజీ
టొమోటోలు.. రెండు
ఉల్లిపాయ.. ఒకటి
క్యాప్సికమ్.. ఒకటి
పసుపు.. ఒక టీ.
కారం.. ఒక టీ.
మటన్ మసాలా.. ఒక టీ.
గరంమసాలా.. ఒక టీ.
ఉప్పు.. తగినంత
కొత్తిమీర.. ఒక కట్ట
వెన్న.. 6 టీ.
వెల్లుల్లి రెబ్బలు.. నాలుగు

తయారీ విధానం :
మష్రూమ్స్‌ని వేడినీళ్లలో బాగా కడిగి రెండు ముక్కలుగా కోయాలి. ఓ గిన్నెలో వెన్న వేసి కరిగించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లి, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. తరవాత క్యాప్సికమ్‌ ముక్కలు, పసుపు, కారం వేసి వేయించాలి. టొమాటో ముక్కలు కూడా వేసి ఓ రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.

ఆ తరువాత గరం మసాలా, మటన్‌ మసాలా, ఉప్పును కూడా వేసి బాగా కలియబెట్టాలి. ఆపై తగినన్ని నీళ్లు కూడా పోసి మూతపెట్టి సన్నని మంటమీద ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము వేసి కలిపి దించేయాలి. అంతే బటర్ మష్రూమ్స్ తయార్..! ఇది చపాతీల్లోకీ రోటీల్లోకీ చాలా టేస్టీగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి