కావలసిన పదార్థాలు : మైదాపిండి... 100 గ్రా. బేకింగ్ పౌడర్... అర టీ. ఎండు ద్రాక్ష.. పది వెనిల్లా ఎసెన్స్... అర టీ. బటర్... 50 గ్రాములు చక్కెర పొడి... 100 గ్రా. గుడ్డు... రెండు పాలు...ఒక కప్పు
తయారీ విధానం : ముందుగా మైదాపిండిని, బేకింగ్ పౌడర్‌ను కలిపి జల్లెడలో జల్లించి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఎండుద్రాక్షలను కూడా శుభ్రం చేసుకుని వాటిపైగల తొడిమలు తీసి తయారు చేసుకోవాలి. తర్వాత జల్లించిన మైదాపిండి, బేకింగ్ పౌడర్లతో వెన్నను, పంచదార పొడిని బాగా కలిపి క్రీమ్‌లాగా తయారు చేసుకోవాలి. వెనిల్లా ఎస్సెన్స్‌తో కలిపి గిలకొట్టిన గుడ్డు సొనను క్రీంకు బాగా కలపాలి.
ఈ మిశ్రమానికి శుభ్రం చేసిన ఎండు ద్రాక్షను చేర్చి, మైదాను కూడా కలిపి, అరకప్పు పాలు కలుపుకుంటే పిండి జారుగా తయారవుతుంది. జారుగా ఉండే, క్రీమింగ్ చేసుకున్న పిండిని పేపర్ కప్స్‌లో పోసి 500 డిగ్రీల ఫారెన్‌హీట్‌లో 30 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టౌవ్ మీద నుంచి దించి కేక్‌పై చెర్రీపండ్లతో కానీ, మీకు నచ్చిన డ్రైఫ్రూట్స్‌తో, క్రీమ్‌తోనూ అలంకరించుకుని సర్వ్‌చేయొచ్చు.