కావలసిన పదార్థాలు : కోడిగుడ్లు.. ఆరు పాలు.. ఒక లీటర్ పంచదార.. పావు కేజీ యాలకుల పొడి.. కాస్తంత జీడిపప్పు, ఎండుద్రాక్ష... తగినన్ని నెయ్యి.. రెండు టీ.
తయారీ విధానం : ముందుగా గుడ్లను పగులగొట్టి ఓ పాత్రలో వేసి బాగా బీట్ చేసుకోవాలి. లోతైన గిన్నెలో నెయ్యి వేసి వేడి అయిన తరువాత జీడిపప్పు, కిస్ మిస్ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. పాలను బాగా మరిగించాలి. మరిగించిన పాలల్లో పంచదార కలిపి చల్లారనిచ్చి బీట్ చేసిన కోడిగుడ్ల మిశ్రమం, యాలకుల పొడిని కలపాలి.
ఈ మిశ్రమాన్ని జీడిపప్పు, కిస్మిస్ ఉన్న గిన్నెలో పోయాలి. ఫ్రెషర్ పాన్లో ఒక గ్లాసు నీరు పోసి దానిలో ఈ మిశ్రమం గిన్నెను ఉంచి మూతపెట్టి విజిల్ పెట్టకుండా ఆవిరిమీద పదినిమిషాలపాటు ఉడికించి దించేయాలి. మూత తీస్తే అది చూసేందుకు జున్నులాగా ఉంటుంది. దీన్ని వేరే గిన్నెలోకి తీసి బాగా చల్లార్చి ఫ్రిజ్లో ఉంచాలి.
చల్లబడిన తరువాత ఓ బౌల్లో పెట్టి సర్వ్ చేయాలి. అంతే ఎగ్ ఫుడ్డింగ్ సిద్ధమైనట్లే..! ఇది చిన్నారులకు చాలా బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తుంది. చల్లగా వద్దనుకునేవారు ఫ్రిజ్లో ఉంచకుండా అలాగే ఆరగించవచ్చు.