కావలసిన పదార్థాలు : బత్తాయి పండ్లు... రెండు కమలాపండ్లు... రెండు ఆరెంజ్ జ్యూస్... ఒక కప్పు ఖర్జూరాలు... పన్నెండు తేనె... నాలుగు టీ. అనాసపువ్వు లేదా దాల్చిన చెక్క... కాస్తంత పుదీనా కట్టలు... చిన్నవి రెండు
తయారీ విధానం : ముందుగా బత్తాయి, కమలా పండ్ల తొక్కలను వలిచి వాటిని చక్రాల్లాగా కోసి లోతుగా వెడల్పుగా ఉన్న ప్లేటులో సర్దుకోవాలి. మరో గిన్నెలో తేనె, ఆరెంజ్ జ్యూస్, దాల్చిన చెక్క లేదా అనాసపువ్వు, పుదీనా ఆకులను వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బత్తాయి, కమలా ముక్కలపైన పోయాలి. తరువాత దీన్ని ఫ్రిజ్‌లో అరగంటపాటు ఉంచి ఆ తరువాత సర్వ్ చేయాలి. అంతే సిట్రస్ సలాడ్ విత్ డేట్స్ రెడీ...!!