కావలసిన పదార్థాలు : బియ్యం, ఉప్పుడు బియ్యం, కందిపప్పు, శెనగపప్పు... తలా ఒక కప్పు మిరియాలు... రెండు టీ. జీలకర్ర... మూడు టీ. ఎండుమిర్చి... మూడు ఎండుకొబ్బరి తురుము... మూడు టీ. నూనె... తగినంత ఆవాలు... అర టీ. కరివేపాకు... ఒక రెమ్మ ఉప్పు... తగినంత ఇంగువ... కాస్తంత
తయారీ విధానం : శుభ్రం చేసిన బియ్యం, పప్పుల్ని పొడిగానే రవ్వలా చేసుకోవాలి. దీన్ని కప్పుతో కొలిచి ఉంచాలి. ఎండుమిర్చి, ఎండుకొబ్బరి, జీలకర్ర, మిరియాలు మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేయాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి వేడెక్కాక నూనె వేసి ఆవాలు వేసి చిటపటమన్నాక కప్పు రవ్వకి సుమారు రెండున్నర కప్పుల చొప్పున నీళ్లుపోయాలి. నీళ్ళు మరుగుతుండగానే గ్రైండ్ చేసిన మసాలా పొడి, ఉప్పు వేయాలి.
నీళ్లు బాగా మరిగాక ఉప్మా మాదిరిగానే రవ్వ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. మంట తగ్గించి మూతపెట్టి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. చల్లారాక దీన్ని ఉండలుగా చేసుకుని చిన్న చిన్న వడలు మాదిరిగా వేళ్లతో ఒత్తి నూనెవేస్తూ పెనంమీద రెండువైపులా కాల్చి తీస్తే రైస్ కట్లెట్ రెడీ...!