కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చుంటూ.. ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటుపడి శరీర బరువు పెరిగిపోతే.. ఆకుకూరలు, కాయకూరలు తీసుకుంటూ వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు దాల్చిన చెక్కలో సాధారణ యాంటీ యాక్సిడెంట్లతో పోలిస్తే.. పాలీఫినాల్ అనే శక్తిమంతమైన పోషకం ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో సూపర్ ఫుడ్‌గా పనిచేస్తుంది.
ఇది రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువ తక్కువ కాకుండా క్రమబద్ధీకరిస్తుంది. పరీక్షల సమయంలో, పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు మనం తాగే చాయ్‌లో కొద్దిగా దాల్చినచెక్క పొడి వేసుకుంటే మంచిది. ఇది మెదడు పనితీరును చురుగ్గా మారుస్తుంది.
అలాగే కొవ్వు సమస్యతో బరువు పెరిగిన వారు దాల్చిన చెక్క టీని రోజూ తీసుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. శరీరాన్ని ఇబ్బంది పెట్టే వాపూ, అలెర్జీల నుంచి ఈ టీ ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన చెక్క పొడిని కొట్టుకుని ఓ బాక్సులో నిల్వ చేసుకోవాలి. ఆరునెలల పాటు చెడదు.
ఇక చెక్క రూపంలోనే ఉంచితే ఏడాది పాటు దాని సుగుణాలు పదిలంగా ఉంటాయి. దీన్ని అచ్చంగా చాయ్‌లా చేసుకోవచ్చు లేదా మామూలు టీలోనూ కొద్దిగా కలుపుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి ఈ చాయ్ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వేడి నీటిలో దాల్చిన చెక్క పొడిని కలిపి.. 5 నిమిషాల పాటు వేడి చేసి పటిక బెల్లం చేర్చి తీసుకుంటే.. బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.