కర్రను ఎలా శుభ్రపరచాలి: వాడిన ప్రతిసారి కర్రను శుభ్రపరచాలి. ఒక పెద్ద గిన్నెలో గోరువెచ్చని నీటిలో గిన్నెలు తోమే లిక్విడ్ వేయాలి. దీనిలో కర్రను ఉంచి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత పీచుతో కర్రను తోమాలి. బాగా గరుకుగా ఉన్న పీచుతో తోమితే కర్రకు చిన్న చిన్న రంధ్రాలు పడతాయి. దీని వల్ల చపాతీలు సరిగ్గా ఒత్తలేము.
పరిశుభ్రం చేయండి : కొన్ని సార్లు ఎంత కడిగినా - పిండి చిన్న చిన్న కన్నాలలో ఉండిపోతుంది. వీటిలో బ్యాక్టీరియా చేరుతుంది. ఇలా బ్యాక్టీరియా చేరిన కర్రతో చపాతీలు వత్తితే ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల అప్పుడప్పుడు ఈ కర్రను పరిశుభ్రం చేయాలి. దీని కోసం ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకొని.. వాటిలో వెనిగర్ వేయాలి. ఈ మిశ్రమంలో కర్రను కొద్ది సేపు నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లతో కడిగి బయట ఎండలో ఆరబెట్టాలి.