బల్లులు, బొద్దింకల బెడద.. ఇలా చేస్తే పారిపోతాయ్ తెలుసా?

శుక్రవారం, 28 జులై 2023 (19:22 IST)
ఇంట్లో సహజంగా ఎలుకలు, బల్లులు, ఈగలు, దోమలు, బొద్దింకలు రాకుండా నిరోధించవచ్చు. బల్లులు, ఈగలు, దోమలు, బొద్దింకలు, దోమలు మొదలైన వాటిని ఈ సింపిల్ రెమెడీతో తరిమికొట్టవచ్చు. 
 
మనం వంట చేసేటప్పుడు చెత్తకుండీలో వేసే వెల్లుల్లి పాయల తొక్కలు, ఉల్లిపాయ తొక్కలతో ఈజీగా ఈ చిట్కా పాటిస్తే.. ఇంట బల్లులు ఇతరత్రా క్రిమికీటకాలు వుండవు. 
 
వెల్లుల్లి పాయల తొక్కలు, ఉల్లిపాయ తొక్కలతో ఓ రెండు లవంగాలను దంచుకుని ఓ తెలుపు కాటన్ క్లాత్‌లో వుంచి చిన్నపాటి మూటగా కట్టుకోవాలి. 
 
ఈ చిన్నపాటి మూటలను స్టౌ కింద, సింక్ కింద, వాష్ బేసిన్ కింద, బెడ్ కింద వుంచితే బొద్దింకలు, దోమలు, బల్లులు పారిపోతాయి. వారానికి ఓసారి ఈ కాటన్ మూటను మారుస్తూ వుండాలి. ఇలా చేయడం ద్వారా బొద్దింకలు, బల్లుల బెడద వుండదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు