కుకరీ టిప్స్: నాన్ వెజ్ వండేటప్పుడు బొప్పాయి ముక్కలు వేస్తే?

శుక్రవారం, 2 డిశెంబరు 2016 (17:22 IST)
కోడిగుడ్లు ఉడికించేప్పుడు పగలకుండా ఉండాలంటే నీళ్ళలో చిటికెడు ఉప్పు వేయండి.
 
మాంసాహారం వండేప్పుడు అందులో నాలుగు పచ్చి బొప్పాయి ముక్కలు వేస్తే త్వరగా ఉడుకుతుంది.
 
బిర్యానీ చేస్తున్నప్పుడు బియ్యం కడిగిన తరువాత కొద్దిగా నెయ్యి వేస్తే పొడిపొడిగా వస్తుంది.
 
ఆకు కూరల్ని కడిగే నీటిలో కొద్దిగా ఉప్పు లేదా వెనిగర్ కలిపితే క్రిములు తొలగిపోతాయి.
 
పసుపు నీళ్ళతో వంటింట్లో గట్టును శుభ్రం చేస్తే ఈగలు ముసురుకోవు.
 
పాలు కాచేప్పుడు గిన్నె అంచులకు నూనె రాస్తే పొంగకుండా ఉంటాయి.
 
పప్పు తొందరగా ఉడకాలంటే దానిలో చిన్న కొబ్బరి ముక్క వేయండి.

వెబ్దునియా పై చదవండి