ఆకుకూరల్ని వండేటప్పుడు ఆలివ్ నూనెను వేస్తే... ఏమౌతుంది?

మంగళవారం, 10 జనవరి 2017 (12:41 IST)
ఆకుకూరల్ని వండేటప్పుడు కొద్దిగా ఆలివ్‌నూనెను వేస్తే.. అవి ఉడుకుతున్నప్పుడు అవసరమైన పోషకాలు తొలగిపోవు. అలాగే బంగాళాదుంపల చెక్కు తీసేసి ఉడికిస్తే..'సి' విటమిన్‌ స్థాయి పెరుగుతుంది. అలాగే ఉడికించేప్పుడు ఆ గిన్నెపై మూత పెట్టాలి. దానివల్ల పోషకాలు తగ్గకుండా ఉంటాయి. 
 
వెల్లుల్లిని తరిగి వెంటనే పోపులో వేయడం, పదార్థంలో వాడటం కాకుండా... ఐదు నిమిషాలు అలాగే ఉంచండి. కాసేపు గాలికి ఉంచడం వల్ల వాటిల్లో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
క్యారెట్‌ లాంటి వాటిని ఉడికించి ముక్కలు కోయడం కన్నా.. ముందు ముక్కలు తరిగి తరవాత వేయించాలి. అప్పుడు వాటి నుంచి కెరొటినాయిడ్లనే యాంటీఆక్సిడెంట్లు విడుదల అవుతాయి. అవి క్యాన్సర్‌ కణాలను నశింపచేస్తాయి. 

వెబ్దునియా పై చదవండి