damodar prasad, nattikumar and others
ఈ సందర్భంగా అతిథి కె.ఎల్.దామోదర్ ప్రసాద్,మాట్లాడుతూ, కొత్త నిర్మాతలకు చిత్ర పరిశ్రమ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది. అయితే కొత్త నిర్మాతలు చిత్ర పరిశ్రమ మీద కనీసం ఒక ఏడాది పాటు అవగాహన పెంచుకుని వస్తే బావుంటుంది. దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబర్ తరపున మేము ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాం. పెద్ద, చిన్న సినిమాల సమస్యలు, సాధ్యాసాధ్యాల గురించి ఛాంబర్ లో చర్చించబోతున్నాం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, మంచి అభిరుచితో, మంచి కాంబినేషన్ ఆర్టిస్టులతో ఈ సినిమా తీసినట్లు అనిపిస్తోంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆస్తిస్తున్నాను" అని అన్నారు.