దోసెలు, పకోడీ, జంతికలు లాంటివి చేసేటప్పుడు కొద్దిగా పాలు పోసి పిండి కలపాలి. ఆ తర్వాత ఉప్పు వెయ్యాలి. అప్పుడే ఆ వంటలు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. ఎక్కువ వెల్లుల్లిపాయలు పొట్టు తీయాలంటే వెల్లుల్లిపాయ ముక్కల్ని ఐదు నిమిషాల పాటు గోరు వెచ్చని నీటిలో నానబెట్టాలి. తర్వాత పొడిబట్టతో తుడిచేస్తే పొట్టు తీయడం తేలికవుతుంది.
పాలలో జున్ను తీసేటప్పుడు పైన నీరు పారపొయ్యకుండా పిండిలో కలుపుకోవచ్చు. లేదా కూరల్లో వేస్తే కూర రుచిగా ఉంటుంది. అలాగే కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం, వేస్తే చేదును లాగేస్తుంది. కూర రుచిగా ఉంటుంది. పాపడ్‌లు, వడియాలు మొదలైనవి వేయించే ముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ లాగకుండా ఉంటుంది. ఇక వెల్లుల్లితో కలిపి బంగాళాదుంపలు ఉంచితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి.
బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి. గోధుమరవ్వ, మైదా పిండి ప్లాస్టిక్ కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచితే చాలా రోజులు చెడిపోకుండా ఉంటుంది. కాలీఫ్లవర్ ఉడికిన తర్వాత కూడా తెల్లగా ఉండాలంటే ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్ళలో రెండు టీ స్పూన్ల పాలు కలపాలి. 10. చిక్కుళ్లు, పచ్చిబఠాణీలు, ఆకుకూరలు ఉడకబెట్టేటప్పుడు ఒక టీస్పూన్ పంచదార కలిపితే సహజమైన రంగుని కోల్పోవు.